టాలీవుడ్ ప్రముఖ సినీనటి, దర్శకురాలు అయిన విజయనిర్మల (73) ఈరోజు కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్ళు. హైదారాబాదులోని గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె సూపర్ స్టార్ కృష్ణ గారి భర్త. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డారు విజయ నిర్మల కుటుంబ సభ్యులు. తొలి తెలుగు మహిళా దర్శకురాలు కూడా విజయనిర్మలే కావడం విశేషం. 2002లో గిన్నీస్ బుక్‌లో ఆమె పేరు చోటు సంపాదించిన రికార్డు సృష్టించారు విజయనిర్మల. మొత్తంగా 44 చిత్రాలకి దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలు కూడా విజయ్ నిర్మల్ కావడం విశేషం. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా. 1971లో ఈ చితం విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె సినిమాలను తెరకెక్కించడం విశేషం. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆమె కైవసం చేసుకున్నారు.
ఇక ఆమె మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆమె మృతి ఇండస్ట్రీకి తీరని లోటని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఆమె మృతి పట్ల స్పందిచిన కొందరి సినీ ప్రముఖుల్ని ఇప్పుడు చూద్దాం :