సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులైన సెలెబ్రిటీలు.. ఎవరెవరంటే..?

మాతృత్వం తర్వాతే ఆడజన్మకి పరిపూర్ణత. అందుకే పెళ్లయిన ప్రతి మహిళ ఆ ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కొందరికి ఈ అదృష్టం వెంటనే వరిస్తే.. మరికొందరు మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఈ భాగ్యానికి నోచుకోరు. అయితే వైద్య రంగం ఇప్పుడు ఎంతో అభివృద్ధి సాధించింది. టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎన్నో జంటలకు సంతాన భాగ్యం కలిగించగా.. ఇప్పుడు సరోగసి అందుబాటులోకి వచ్చింది. వేరే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని తద్వారా సంతానం పొందే విధానమే సరోగసీ.

తమ బిడ్డను నవమాసాలు మోసిన మహిళకు సదరు దంపతులు భారీగా చెల్లిస్తారు. అంతేకాదు.. బిడ్డ యోగ క్షేమాల్ని కూడా వారే చూసుకుంటారు. అయితే దీనికి కొన్ని దేశాల్లో చట్టపరమైన పరిమితులు వున్నాయి. సరోగసీ రెండు రకాలు… ఒకటి ట్రెడిషనల్ సరోగసీ, రెండోది జెస్టేషనల్ సరోగసీ. ఇది కొంచెం ఖరీదైనది కావడంతో అందరూ సరోగసీ వైపు చూడటం లేదు. బాగా డబ్బున్న వాళ్లు, ప్రముఖులే దీనిని ఆశ్రయిస్తున్నారు. అలా సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన వారెవరో ఒకసారి చూస్తే.

1) ప్రియాంక చోప్రా : బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్‌లు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. తాను తల్లిని అయ్యానంటూ ప్రియాంక ట్వీట్ చేయడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యాడు. గర్భం దాల్చకుండా తల్లి ఎప్పుడైందని ప్రశ్నించారు. అయితే తాము సరోగసీ ద్వారా ఈ భాగ్యాన్ని పొందినట్లు ప్రియాంక తెలిపారు.

2) సన్నీలియోన్ : బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్ కూడా సరోగసీ ద్వారా ఇద్దరు కవలలను పొందారు. అంతేకాదు సన్నీలియోన్ దంపతులు మరో బిడ్డను కూడా దత్తత తీసుకున్నారు.

3) కిరణ్ రావు : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యుల సూచన మేరకు సరోగసీ ద్వారా మగబిడ్డను పొందారు.

4) గౌరీ ఖాన్ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆయన సతీమణి గౌరీ ఖాన్ కూడా సరోగసీ ద్వారానే మూడో బిడ్డను కన్నారు. 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం మంచిది కాదని వైద్యులు చెప్పడంతో ఆమె కూడా సరోగసీ ద్వారా అక్బర్ ఖాన్ కు జన్మనిచ్చారు.

5) మంచు లక్ష్మీ : ఇక తెలుగులో సరోగసీ అంటే మంచు లక్ష్మీ టక్కున గుర్తొస్తారు. గుజరాత్ కు చెందిన ఓ మహిళ ద్వారా మంచు లక్ష్మీ దంపతులు సరోగసి విధానంలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

6) కరణ్ జోహార్ : బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అన్నట్లు ఆయనకు ఇంకా పెళ్లికాలేదు. తన పిల్లల యోగక్షేమాలను కరణ్ తన తల్లికే అప్పగించారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus