2023లో తల్లిదండ్రులు అవుతున్న సెలబ్రిటీలు ఎవరంటే..

చదువు, ఉద్యోగం, పెళ్లి, పెళ్లాం, పిల్లలు.. బాధ్యతలు, బరువులు, వాళ్ల పిల్లలు.. ఇదీ సాధారణంగా వివాహం అనే విషయం ఎత్తగానే అందరూ చెప్పుకునే మాటలు.. కానీ సెలబ్రిటీల విషయానికొస్తే పెళ్లి నుండి మ్యారేజ్ దగ్గరినుండి పిల్లల వరకు ప్రతీది ప్లాన్ చేసుకోక తప్పదు. హీరోయిన్ల అయితే కెరీర్‌కి ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఎందుకంటే పెళ్లి అని ప్రకటించగానే దాదాపు వాళ్ల కెరీర్ ఎండ్ అయినట్టే కాబట్టి.. 2022లో తొలిసారి తాము పేరెంట్స్ కాబోతున్నామని ప్రకటించి, 2023లో తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించబోతున్న సెలబ్స్ ఎవరో చూద్దాం..

1. రామ్ చరణ్ – ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని తాము పేరెంట్స్ అవబోతున్నామని డిసెంబర్‌లో ప్రకటించారు. వివాహమైన 10 ఏళ్ల తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2. గౌహర్ ఖాన్ – జైద్ దర్బార్

బిగ్ బాస్ – 7 విన్నర్ గౌహర్ ఖాన్ తమ కుటుంబంలోనికి మరో వ్యక్తి రాబోతున్నారంటూ ఓ బ్యూటిఫుల్ యానిమేటెడ్ వీడియో షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రేక్షకాభిమానులతో పంచుకున్నారు..

3. నేహా మర్దా – ఆయుష్మాన్ అగర్వాల్

‘బాలికా వధు’ సీరియల్‌తో పాపులర్ అయిన నేహా మర్దా 2023లో తాను మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించబోతున్నానంటూ 2022 నవంబర్‌లో అనౌన్స్ చేశారు.

4. కృష్ణ ప్రియ – అట్లీ కుమార్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. తమిళనాట స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగి.. బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారు. ఆయన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2022 డిసెంబర్‌లో ఈ శుభవార్త చెప్పారు ప్రియ – అట్లీ..

ఇప్పటి వరకు వీరంతా ఈ ఏడాది పేరెంట్‌హుడ్‌ని ఎంజాయ్ చేయబోతున్నసెలబ్రిటీలు.. ఇటీవలే సీమంతం ఫంక్షన్ జరుపుకున్న యాంకర్ లాస్యతో పాటు మరికొంత మంది సెలబ్స్ ఈ లిస్టులో యాడ్ కాబోతున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus