హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం ఉండడంతో ఈ సినిమా విడుదలకు సెన్సార్ అభ్యంతరం తెలిపింది.అయితే ఈ సినిమా విడుదల మనదేశంలో కాకుండా గల్ఫ్ దేశాలలో విడుదల చేయకూడదని సెన్సార్ ఈ సినిమా విడుదలకు బ్రేకులు వేసింది. ఇలా సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు సెన్సార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటనే విషయానికి వస్తే…
ఈ సినిమాలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయన్న ఒక కారణంతో గల్ఫ్ దేశాలలో ఈ సినిమా విడుదల చేయకూడదని సెన్సార్ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ అభ్యంతరం తెలియచేయడంతో మరోసారి చిత్ర బృందం సెన్సార్ సభ్యుల ముందుకు సినిమాను తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు సభ్యుల సూచనల మేరకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించి ఈ సినిమాని గల్ఫ్ దేశాలలో కూడా విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమా గల్ఫ్ దేశాలలో యధావిధిగా విడుదలవుతుందా లేదంటే ఆలస్యంగా విడుదలవుతుందా అనే విషయం తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి ఉండాలి. ఈ సినిమా ఐదవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.
ఇకపోతే గత రాత్రి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హాజరు కావడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?