యూట్యూబ్‌లో విడుదలయ్యే సినిమాల టీజర్లు, ట్రైలర్‌లకు సెన్సార్ ఉండదు అని అందరికీ తెలుసు. అందుకే రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు అసభ్యకర కంటెంట్‌ను సినిమాలుగా తీసి కాలర్ ఎగేరేశారు. ఆ తర్వాత చాలామంది అలాంటి కంటెంట్‌తో యూట్యూబ్ ఛానళ్లను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందంతా తెలిసినవాళ్లు కూడా ‘టాక్సిక్’ సినిమా టీజర్ చూసి ఇంటిమేట్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు గురించి కామెంట్లు చేస్తున్నారు. తాజాగా దీనిపై సెన్సార్ బోర్డు ఛైర్మన్ స్పందించారు.
Toxic
యశ్ – గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో ఐదుగురు హీరోయిన్లతో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఇటీవల వచ్చిన ఈ సినిమా టీజర్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇలాంటి సీన్లు ఇప్పటివరకు సినిమాల్లో ఎప్పుడూ రానట్లు, లేనట్లు కొంతమంది హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ఈ సినిమా గురించి నడుస్తున్న చర్చల విషయంలో ఈ దశలో తాను ఎలాంటి స్పష్టత ఇవ్వలేను అని చెప్పారు. అలాగే డిజిటల్ మీడియాలో వచ్చే కంటెంట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అన్ని వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదు. అవి అసలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే చూసే ప్రతి వీడియో సెన్సార్ పొందిందే అన్న భావన సరికాదు. ఆ ఆలోచన నుండి బయటకు రావాలి. అంతేకాదు ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ అయ్యాకనే చూస్తున్నాం అనుకోవద్దు. ఆ కంటెంట్ సెన్సార్ వద్దకు రాదు. ఆ కంటెంట్‌కు ధ్రువీకరణ ఉండదు అని ప్రసూన్ జోషి తెలిపారు.
ఈ వైరల్ విషయం మీద మాట్లాడిన ప్రసూన్ జోషీ.. మరో ట్రెండింగ్ టాపిక్ ‘జన నాయగన్’ సినిమా గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఆ సినిమా చట్టపరమైన చిక్కుల్లో ఉందని, న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని ముగించారు. ఈ సినిమా కేసు విచారణ ఈ నెల 20న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో జరగనుంది. ఆ రోజు తీర్పు బట్టి సినిమా విడుదల ఉండనుంది.