సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన రెండో సినిమా ‘ఛాంపియన్'(Champion). మొదటి సినిమా ‘పెళ్లిసందD’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ‘ఛాంపియన్’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ‘స్వప్న సినిమా’ ‘జీ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘కాన్సెప్ట్ ఫిలిమ్స్’ సంస్థల పై ప్రియాంక దత్,జికె మోహన్, జెమినీ కిరణ్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్, ట్రైలర్స్, గిర గిర గింగిరానివే పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అయితే మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే
| నైజాం | 0.50 cr |
| సీడెడ్ | 0.18 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.59 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.27 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.07 cr |
| ఓవర్సీస్ | 0.13 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 1.57 కోట్లు(షేర్) |
‘ఛాంపియన్'(Champion) సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.క్రిస్మస్ హాలిడేని ఈ సినిమా బాగానే వాడుకుంది. మొదటి రోజు రూ.1.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
