నవదీప్ (Navdeep) , శివ బాలాజీ (Siva Balaji)..లు హీరోలుగా కాజల్ (Kajal Aggarwal) , సింధు మీనన్ (Sindhu Menon) హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘చందమామ’ (Chandamama). కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ (C. Kalyan) మరియు ఎస్.విజయానంద్ లు నిర్మించారు. 2007వ సంవత్సరం సెప్టెంబర్ 6న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయితే మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రాబట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది ఈ మూవీ. కె.ఎం.రాధా కృష్ణన్ (K. M. Radha Krishnan) సంగీతం, ప్రసాద్ మురెళ్ళ (Prasad Murella) సినిమాటోగ్రఫీ, కృష్ణవంశీ డైరెక్షన్..
‘చందమామ’ ని సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెట్టాయి. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ (Chandamama Collections) ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం | 2.58 cr |
సీడెడ్ | 1.19 cr |
ఉత్తరాంధ్ర | 1.21 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.36 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 0.64 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.87 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.35 cr |
‘చందమామ’ (Chandamama Collections) చిత్రం రూ.4.85 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా రూ.9.35 కోట్ల షేర్ ను రాబట్టి…. రూ.4.5 కోట్ల లాభాలను బయ్యర్స్ కి పంచి సూపర్ హిట్ మూవీగా నిలిచింది ‘చందమామ’. తర్వాత నిర్మాతకి శాటిలైట్ రైట్స్ రూపంలో లాభాలను పంచింది.