టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో చంద్ర మోహన్ శనివారం రోజు తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. 82 ఏళ్ల వయసు కల్గిన ఆయన గత కొంత కాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అనంతరం కన్నుమూశారు. అయితే ఇయన గురించి ఓ అసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలంగా ముకుటంలేని మహారాజు గానే కొనసాగారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. ఆయన సినీ ప్రస్థానం కొనసాగించారు.
కొన్నికొన్ని సందర్భాల్లో కొంత మంది హీరోలకు బదులుగా అనేక అవకాశాలు చంద్రమోహన్‌ను వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా శోభన్‌బాబుతో వర్కౌంట్ కానీ సినిమాలు చంద్రమోహన్‌ను ప్రిఫర్ చేసేవారంట ఇలా చంద్రమోహన్‌కు వచ్చిన అవకాశాలు అనేకం. పదహారేళ్ల వయసు సినిమాకు శోభన్‌బాబును అనుకున్నారు. కానీ, కుంటి పాత్ర చేయనని శోభన్‌బాబు తెగేసి చెప్పడంతో వెంటనే రాఘవేంద్రరావుకు చంద్రమోహన్ కనిపించారు.ఈ పాత్రలోఆయన జీవించేశారు.
అలానే.. శంకరాభరణం సినిమాలోనూ శోభన్‌బాబుకు అవకాశం ఇచ్చారు. ఆయన అడ్వాన్సు కూడా తీసుకున్నారు.కానీ, సెకండ్ హాప్‌లో హీరో పరిచయం ఏంటని మానుకున్నారు. ఈ సినిమా చాన్స్ కూడా చంద్రమోహన్‌ను వెతుక్కుంటూ వెళ్లింది. ఇది కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇక, దేవాలయంలో మాత్రం చంద్రమోహన్ కాకుండా.. శోభన్‌బాబే నటించారు. కానీ, ఈ సినిమా ఫెయిల్ అయింది. ఇదిలావుంటే.. ఒక్క శోభన్ బాబు పాత్రలనే కాదు.. ఇతర నటుల పాత్రలను కూడా చంద్రమోహన్ అందిపుచ్చుకున్నారు.
ఒకానొక దశలో హీరోగా బిజీ అయిపోయిన (Chandra Mohan) చంద్రమోహన్‌కు క్యారెక్టర్ పాత్రలు వచ్చాయి. కలికాలం వంటి సినిమాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. ఎక్కడా రాజీ పడకపోవడం.. ఎలాంటి పాత్రలనైనా అలవోకగా చేయడం చంద్రమోహన్‌కు వెన్నతోపెట్టిన విద్య.దీనికి తోడు ఆర్థిక క్రమ శిక్షణ ఆయనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. మొత్తానికి చంద్రమోహన్ ఒక చరిత్ర.. అగ్ర హీరోల సరసన చేర్చుకునే సమున్నత నటుడు అనడంలో సందేహం లేదు.