అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పుష్ప సినిమా ఈ నెల 17వ తేదీన రిలీజ్ కానుంది. ఈరోజు ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుండగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. బాహుబలి, కేజీఎఫ్ తరహాలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచాయి. పుష్ప పాటలు రాసిన చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సాంగ్స్ రిలీజైన తర్వాత చాలామంది అభినందిస్తూ సందేశాలు పంపారని అన్నారు. కొంతమంది యువకులు అమెరికా నుంచి ఫోన్ చేసి పుష్ప పల్లవులు, చరణాలు వినిపించారని చెప్పుకొచ్చారు. ఆర్య మూవీ నుంచి సుకుమార్ తో అనుబంధం ఉందని సుకుమార్ కవి కావడంతో ఆయనను సంతృప్తిపరచడం సవాల్ అని చంద్రబోస్ అన్నారు.
పుష్ప చిత్తూరు యాసలో నడిచే కథ కావడంతో ఆ పదాలను వాడి పాటలు రాశానని ఈ సినిమా పాటలు తన కెరీర్ కు ఛాలెంజ్ విసిరాయని చంద్రబోస్ అన్నారు. రంగస్థలంకు సందర్భాలు మాటలు పలికాయని అవే పాటలై పోయాయని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. లిరికల్ షీట్ రిలీజ్ చేసే సమయంలో పేపర్ పై పాటల రూపాన్ని పెట్టానని చంద్రబోస్ వెల్లడించారు. 27 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని ఇలా జరగడం అదృష్టంగా భావిస్తానని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.