Chandramukhi 2 Collections: ‘చంద్రముఖి 2’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి 2 ‘ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్, మహిమ నంబియార్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ మీనన్, సుభిక్ష, వడివేలు, రాధికా శరత్ కుమార్, రావు రమేష్ లు కూడా కీలక పాత్రలు పోషించారు. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా రూపొందింది. దీంతో ‘చంద్రముఖి 2 ‘ పై అంచనాలు బాగానే పెరిగాయి.

టీజర్, ట్రైలర్స్ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు కానీ ‘చంద్రముఖి’ అభిమానులు ఈ సినిమా చూడాలని సెప్టెంబర్ 28 కోసం ఎదురు చూశారు. కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఫుల్ రన్లో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.38 cr
సీడెడ్ 0.60 cr
ఉత్తరాంధ్ర 0.51 cr
ఈస్ట్ 0.38 cr
వెస్ట్ 0.32 cr
గుంటూరు 0.42 cr
కృష్ణా 0.38 cr
నెల్లూరు 0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.27 cr

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రానికి తెలుగులో ఏకంగా రూ.9.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.4.27 కోట్ల షేర్ ను రాబట్టింది . ఫైనల్ గా రూ.5.13 కోట్ల నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా మిగిలింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus