Prabhas: ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మారనుందా..?

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జులై 30వ తేదీన విడుదల కానున్నట్టు అధికారక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. సాహో తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే జులై 30వ తేదీన రాధేశ్యామ్ సినిమా విడుదల కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను గోపికృష్ణా మూవీస్ బ్యానర్ తో పాటు టీ సిరీస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని రోజుల క్రితం వరకు శరవేగంగా జరిగాయి. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ను మార్చుకుంటే ఇతర సినిమాలు కూడా రిలీజ్ డేట్ ను మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా వల్ల ముంబైలో జరగాల్సిన వీఎఫ్ ఎక్స్ పనులు ఆగిపోయాయని ఆ ప్రభావం సినిమా రిలీజ్ డేట్ పై పడనుందని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ లో ఈ సినిమా పనులు పూర్తి చేయించనున్నారని తెలుస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకు అమిత్ త్రివేది మితున్ సంగీతం అందిస్తుండగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుకున్న సమయానికి రాధే శ్యామ్ రిలీజ్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus