Charmme Kaur: ఎమోషనల్ అయిన ఛార్మి.. ఏం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఛార్మి కౌర్ ప్రస్తుతం నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్న ఛార్మి లైగర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. లైగర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. లైగర్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

తాజాగా ఛార్మి కౌర్ యాంకర్ గా పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలను ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూరీ జగన్నాథ్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఛార్మి మాట్లాడుతూ నేను ఛార్మిగా ఇక్కడకు రాలేదని ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అందుకు సంబంధించిన ప్రశ్నలను నేను అడుగుతానని ఆమె కామెంట్ చేశారు. లైగర్ సినిమా నుంచి ఇంకో ట్రైలర్ వస్తుందా? ట్రైలర్ లో కథ తెలియట్లేదు అని అడుగుతున్నారని ఛార్మి చెప్పగా ట్రైలర్ లో చాలామంది ఎక్కువ డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారని పూరీ జగన్నాథ్ చెప్పారు.

విజయ్ దేవరకొండ మీరు ఎగ్జైట్ అయినట్టే మూవీ ఉంటుందని చెప్పుకొచ్చారు. మైక్ టైసన్ ను చాలా క్రూరంగా ఎక్స్ పెక్ట్ చేశామని అయితే చాలా సరదాగా చూపించారని ఛార్మి అడగగా విజయ్ దేవరకొండ ఆ ప్రశ్నకు జవాబిచ్చినట్టు ప్రోమోలో చూపించారు. పొరపాటున సినిమా చూడటానికి జనాలు రాకపోతే సినిమా బాలేదని టాక్ వస్తే పరిస్థితి ఏంటని ఛార్మి ప్రశ్నించారు.

ఆ తర్వాత ఛార్మి లైగర్ సినిమాకు లాక్ డౌన్ సమయంలో భారీ ఓటీటీ ఆఫర్ వచ్చిందని చేతిలో రూపాయి లేకపోయినా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఛార్మి ఆఫర్ రిజెక్ట్ చేయడం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నెల 19వ తేదీన ఫుల్ వీడియో రిలీజ్ కానుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus