Charmme Kaur: పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చార్మి

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి హీరోయిన్గా సినిమాలకు దూరమయ్యారు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు సరసన నటించారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ తో కలిసి ఈమె నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నిర్మాతగా మాత్రం ఛార్మి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.

అయితే ఈమె పెళ్లి చేసుకోకపోవడంతో ఈమె పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. గతంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో ఈమె రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ అప్పట్లో వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ఇలాంటి తరుణంలోనే వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు.

ఇక ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు చేస్తూ ఇద్దరు ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కూడా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఛార్మి తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

అప్పట్లో ఆయనకు పెళ్లి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డానని ఈమె తెలియజేశారు. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ సింగిల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు మరోసారి పెళ్లి జరిగితేనే నేను పెళ్లి చేసుకుంటానని ఆయన పెళ్లి తర్వాతే నా పెళ్లి జరుగుతుంది అంటూ (Charmme Kaur) చార్మి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus