Chatrapathi Collections: హిందీ ‘ఛత్రపతి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ .. హిందీలో కూడా శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేయడం విశేషం. టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తో పోల్చి హిందీ ‘ఛత్రపతి’ ని బాగా విమర్శించారు. అయినప్పటికీ నార్త్ లో మాస్ సెంటర్స్ లో ‘ఛత్రపతి’ కి మంచి టాక్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు చూసిన కొందరు మాస్ ఆడియన్స్ ‘ఛత్రపతి’ కి పాజిటివ్ టాక్ చెప్పారు.

అయినా అక్కడ ఈ మూవీ (Chatrapathi) ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. తొలిరోజు ఈ చిత్రం అక్కడ మొత్తంగా రూ.94 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది. రూ.52 లక్షల నెట్ ను కలెక్ట్ చేసింది. ఇక మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ అక్కడ కేవలం రూ.80 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించినట్టు తెలుస్తుంది. ‘ఛత్రపతి’ ని పెన్ స్టూడియోస్ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు.

సో థియేట్రికల్ పరంగా ఎంతొచ్చినా పర్వాలేదు.కాకపోతే రెంట్లు, కరెంట్ బిల్లుల అమౌంట్ అయినా ‘ఛత్రపతి’ రాబట్టాలి. మొదటి వీకెండ్ కలెక్షన్స్ తో ఆ మెయింటెనెన్స్ ఖర్చులు సరిపోతాయో లేదో మేకర్స్ కే తెలియాలి. ‘ది కేరళ స్టోరీ’ సినిమా అక్కడ ఫుల్ స్వింగ్ లో ఉండటం, ‘ఛత్రపతి’ ఒరిజినల్ వెర్షన్ ను నార్త్ జనాలు ఎక్కువగా చూసేయడం వంటి కారణాల వల్ల బెల్లంకొండ ‘ఛత్రపతి’ కి అక్కడ కలెక్షన్స్ నమోదు కావడం లేదు అని స్పష్టమవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus