Chatrapathi: ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు.. ఛత్రపతి రీ రిలీజ్ అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఆకాశమే హద్దుగా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండగా సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ అంచనాలకు మించి పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి మూవీ ఆప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ కావడంతో పాటు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా రీ రిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఛత్రపతి సినిమాను అక్టోబర్ 23వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. రీ రిలీజ్ లో సైతం ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే దసరా సినిమాలు ఈ నెల 19వ తేదీన, 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.

ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ సినిమాలు 3000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సులువుగా సొంతం చేసుకుంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ నెల 22వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు వేరే లెవెల్ లో ఉండనున్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ అభిమానించే అభిమానుల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus