పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా ‘ఛత్రపతి’. అంతేకాదు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో ప్రభాస్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే. వాస్తవానికి వీరి కాంబినేషన్లో ‘స్టూడెంట్ నెంబర్ 1’ రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఆ సినిమా చేయలేకపోయాడు. ‘అడవి రాముడు’ ‘చక్రం’ వంటి ఫ్లాపులతో ప్రభాస్ కొంచెం డీలా పడ్డ టైంలో ‘ఛత్రపతి’ వచ్చింది.
మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. శ్రియ శరణ్ ప్రభాస్ కి జోడీగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భాను ప్రియా ప్రభాస్ తల్లిగా నటించింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. 2005 సెప్టెంబర్ 30న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మౌత్ టాక్ తోనే షో షోకి బాక్సాఫీస్ వద్ద పెంచుకుంటూ పోయింది ఈ సినిమా.
నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒకసారి కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.58 cr |
సీడెడ్ | 2.54 cr |
ఉత్తరాంధ్ర | 1.66 cr |
ఈస్ట్ | 1.08 cr |
వెస్ట్ | 0.93 cr |
గుంటూరు | 1.27 cr |
కృష్ణా | 1.11 cr |
నెల్లూరు | 0.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.45 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 16.35 cr |
‘ఛత్రపతి’ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.10.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.16.35 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా బయ్యర్లకి రూ.6.15 కోట్ల లాభాలు మిగిల్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ‘బాహుబలి’ తో ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు ప్రభాస్, రాజమౌళి.