‘చైసామ్’ చిత్రం రేటు గట్టిగానే పలికింది..!

పెళ్ళైన తరువాత మొదటి సారి హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు నాగ చైతన్య , సమంత. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏమాయ చేసావే’ ‘మనం’ ‘ఆటో నగర్ సూర్య’ వంటి చిత్రాలు వచ్చాయి. చాలా గ్యాప్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ‘మజిలీ’ చిత్రం రూపొందుతుంది. నాని తో ‘నిన్ను కోరి’ లాంటి సూపర్ హిట్ ను తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కి సంబందించిన వైజాగ్ షెడ్యూల్ పూర్తయ్యింది.ఈ షెడ్యూల్ లో రెండు సాంగ్స్ ను చిత్రీకరించారట.

ఇదిలా ఉండగా ‘మజిలీ’ చిత్ర శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ప్రముఖ ఛానెల్ జీ తెలుగు&జీ5 దక్కించుకున్నాయని తెలుస్తుంది. దాదాపు 6కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది హైయెస్ట్ కావడం విశేషం. మాస్ ప్రయత్నంగా వచ్చిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం తప్ప ‘చైసామ్’ చేసిన ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి రొమాంటిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రం కూడా రొమాంటిక్ ఎంటర్టైనెర్ కావడంతో ‘మజిలీ’ చిత్రాన్ని ఇంత భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దివ్యంక కౌశిక్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరూ నాని తో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి నాని డైరెక్టర్… అలాగే నాని ప్రొడ్యూసర్ కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus