అలా ‘మజిలీ’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందో లేదో.. ఇలా తన భార్య సమంత తో కలిసి స్పెయిన్ హాలిడే ట్రిప్ కు చెక్కేసాడు నాగ చైతన్య. అసలే హాట్ సమ్మర్ కదా.. దీంతో అక్కడ సేద తీరుతుంది ‘చైసామ్’ జంట. అక్కడ వీరు సరదాగా తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మన నెటిజన్లు కూడా ‘శ్రావణి,పూర్ణ.. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా’ అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. అంతేనా ‘కపుల్ గోల్స్’ అంటూ మరోసారి రచ్చ చేస్తున్నారు. ఈ జంటకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
ఇక ఈ పిక్ లో బ్లాక్ బికినీతో సమంత ఉండగా… నాగ చైతన్య ‘షర్ట్ లెస్’ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ ఫోటీలో ‘ఐ లవ్ యు 3000 టైమ్స్’ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఇది అవెంజర్స్ స్టైల్ అనుకోండి. ఏదేమైనా ఈ మధ్య సమయం దొరికినప్పుడల్లా హాలిడే ట్రిప్పులకి చెక్కేస్తోంది ‘చైసామ్’ జంట. ఈ విషయంలో నాగచైతన్య తండ్రి నాగార్జుననే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఏదేమైనా ‘చైసామ్’ జంట మరోసారి వైరలయ్యింది. ఇక నాగచైతన్య ప్రస్తుతం తన మావయ్య వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తుండగా సమంత ‘ఓ బేబీ’ ‘మన్మధుడు2’ చిత్రాల్లో నటిస్తుంది.