బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై చండీగఢ్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఆయన సోదరి అల్విరా ఖాన్ తో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కి చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణల్లో ఏదైనా నేరకోణం దాగి ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు తనను కొత్త ఫ్రాంచైజీ తెరవమని అడిగారని.. దానికి పెట్టుబడిగా రెండు, మూడు కోట్లు అవుతుందని చెప్పడంతో అంగీకరించి.. అంత మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. షోరూం తెరిచి సంవత్సరం గడుస్తున్నా.. తనకు సదరు సంస్థ నుండి రావాల్సిన స్టాక్ రాలేదని అరుణ్ గుప్తా చెప్పారు. మొదట్లో ఈ విషయమై సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్ తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పిన విషయాన్ని తెలిపారు.
ఈ క్రమంలో అతడు సల్మాన్ ఖాన్ ను కలవగా.. షోరూం ప్రారంభోత్సవాన్నికి కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ తరువాత రాలేదని.. ఆయనకు బదులుగా మరొక వ్యక్తి వచ్చినట్లు చెప్పారు. షోరూం ఓపెన్ చేసి ఏడాదిన్న గడిచినప్పటికీ ఇప్పటివరకు తనకు వాళ్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదని అరుణ్ గుప్తా వాపోయారు. దీంతో సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాష్ సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!