Check Movie: బుల్లితెర పై పర్వాలేదు అనిపించిన నితిన్ ‘చెక్’ మూవీ..!

నితిన్ సినిమాలు ఈ మధ్య కాలంలో బుల్లితెర పై కూడా నిరాశపరుస్తున్నాయి. గతేడాది నితిన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భీష్మ’ టీవీల్లో మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 6.65 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. కానీ సెకండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 7.60 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి పర్వాలేదు అనిపించింది. అయితే ‘రంగ్ దే’ మూవీ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7.22 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

అయితే ఈ రెండింటితో పోలిస్తే ‘చెక్’ మూవీ పర్వాలేదు అనిపించింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ ను ఇటీవల జెమినీ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఈ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో 8.53 రేటింగ్ నమోదు అయ్యింది.ఇది కాస్త పర్వాలేదు అనే చెప్పాలి. చెప్పాలంటే ఇది ‘రంగ్ దే’ కంటే పెద్ద ప్లాప్. కానీ బుల్లితెర పై పర్వాలేదు అనిపించింది. ఇక నితిన్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘మాస్ట్రో’ మూవీ ఆగష్ట్ లో విడుదల కాబోతుంది.

హిందీలో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ కి ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో ఈ మూవీ నేరుగా ఓటిటిలో విడుదల కాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది కానీ దాని పై నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus