AR Rahman: డిప్రెషన్‌ గురించి ఏఆర్‌ రెహమాన్‌ చిట్కాలు.. అలా చేస్తే సరి అంటూ..!

ప్రస్తుతం వార్తల్లో విరివిగా వినిపిస్తున్న పేరు ఏఆర్‌ రెహమాన్‌  (AR Rahman)  . అది ఆయన సినిమాల గురించో, అవార్డులు వచ్చినదాని గురించో కాదు. ఆయన విడాకులు తీసుకున్న విషయం గురించి. విడాకులు తీసుకోవడానికి రెహమాన్‌, సైరా బాను నిర్ణయం తీసుకున్నారు. ఇది పరస్పర అంగీకారంతోనే జరిగింది అంటూ రెహమాన్‌ తరఫు లాయర్‌ ఇటీవల చెప్పారు. అయితే ఆయన నిర్ణయం వెనుక వేరే కారణం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెహమాన్‌ ఇటీవల ఇఫీ వేడుకలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడాకుల గురించి, డిప్రెషన్‌ గురించి ఆయన కొన్ని కామెంట్లు చేశారు.

AR Rahman

ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘జీవితంలో ముఖ్యమైన దాన్ని కోల్పోయామనే భావనలో చాలామంది ఉంటున్నారు. జీవితం శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తున్నారు’’ అని చెప్పారు రెహమాన్‌. శూన్యంగా మారిందనే ఆలోచనను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియడం లేదు. చదవడం, రాయడం, సంగీతం వినడం లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అని రెహమాన్‌ డిప్రెషన్‌ను ఎదుర్కోవడానికి టిప్స్‌గా చెప్పారు.

మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు రావు అని తన తల్లి చెప్పిందని, అప్పటి నుండి ఆత్మహత్య ఆలోచన మనసులో రాకుండా చేసుకున్నా అని చెప్పారు. ఇక విడాకుల గురించి మాట్లాడుతూ తన విడాకుల ప్రకటన ఎన్నో రూమర్లు వచ్చాయని, అయితే అవన్నీ నిజం కావని చెప్పారు. విడిపోవాలనే నిర్ణయం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని కూడా చెప్పారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా రెహమాన్‌ విడాకులకు కారణం అని చెబుతున్న మోహిని డే కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన టీమ్‌లో పని చేస్తున్న ఆమె కూడా ఇటీవల విడాకులు తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అని పుకార్లు రేపారు. అయితే రెహమాన్‌ తనకు తండ్రి సమానుడు అని చెప్పింది మోహిని డే.

చైతన్య – శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus