Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Chhaava Review in Telugu: ఛావా సినిమా రివ్యూ & రేటింగ్!

Chhaava Review in Telugu: ఛావా సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 14, 2025 / 06:33 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Chhaava Review in Telugu: ఛావా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్కీ కౌశల్ (Hero)
  • రష్మిక మందన్న (Heroine)
  • అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, డయానా పెంటీ (Cast)
  • లక్ష్మణ్ ఉటేకర్ (Director)
  • దినేష్ విజన్ (Producer)
  • ఏ.ఆర్.రెహమాన్ (Music)
  • సౌరభ్ గోస్వామి (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 14, 2025
  • మ్యాడ్డాక్ ఫిలింస్ (Banner)

విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఛావా” (Chhaava). ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభు మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకుడు. దినేష్ విజన్ (Dinesh Vijan) నిర్మించిన ఈ చిత్రాన్ని “పుష్ప 2”కు (Pushpa 2) పోటీగా విడుదల చేద్దామనుకున్నారు కానీ.. పుష్ప టీమ్ అభ్యర్థన మేరకు వాయిదా వేసి నేడు (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ మరాఠా మహారాజు బయోపిక్ ఎలా ఉందో చూద్దాం..!!

Chhaava Review

కథ: ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా(Akshaye Khanna)) తనకు పోటీ లేదని గర్వంతో విర్రవీగుతుండగా.. కదనరంగంలోకి అడుగిడతాడు శంభు మహారాజ్ (విక్కీ కౌశల్). ఛత్రపతి శివాజీ తనయుడిగా స్వరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా సింహంలా ముందుకు సాగే శంభును ఎదిరించడానికి లక్షల మంది మొఘల్ సైన్యానికి చేతకాదు.

అయితే.. సంఘమేశ్వర్ లో శంభు మహారాజ్ అతితక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న ముఘలులు దొడ్డిదారిన అతడ్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. వేల మందిని మొండి చెయ్యితో ఎదిరించి.. చేతులు సంకెళ్ళతో కట్టేసేవరకు పోరాడుతూనే ఉంటాడు శంభు. అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు.. చేతికి చిక్కిన శంభును ఏ స్థాయిలో హింసించాడు? ఆ హింసను శంభు మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడు? అనేది ముగింపు.

నటీనటుల పనితీరు: విక్కీ కౌశల్ ఈ సినిమాలో చూపిన నట విశ్వరూపానికి నేషనల్ అవార్డ్ కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక పాత్రను ఎంతలా ఓన్ చేసుకుంటే.. ఈ స్థాయిలో జీవించగలడు చెప్పండి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో విక్కి నటన కన్నీరు పెట్టించడమే కాక.. మనసు లోతుల్లో బలమైన భావోద్వేగానికి మేలుకొలుపుతుంది. కళ్లల్లో ధీరత్వమే కాదు,గొంతులో గంభీరతను కూడా అద్భుతంగా పండించాడు విక్కీ కౌశల్.

రష్మిక మందన్న (Rashmika Mandanna) మరో మంచి పాత్రలో ఆకట్టుకుంది. ఎడబాటును, భర్త బాధను మానసికంగా భరించి భార్యగా ఆమె పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది. మన తెలుగు సినిమాల్లో కామెడీ విలన్స్ గా చూపించే.. అశుతోష్ రాణా (Ashutosh Rana), ప్రదీప్ రావత్ (Pradeep Rawat) లాంటి ఎంతో మంది నటులకు అద్భుతమైన పాత్రలు, ఎలివేషన్స్ పడ్డాయి. ఇంత మంచి నటుల్నా మనం సరిగా వాడుకోకుండా వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ (A.R.Rahman) సంగీతం ఈ సినిమాని ఎలివేట్ చేసిన విధానం గురించి మరో పదేళ్లు మాట్లాడుకుంటారు. హీరోయిజం నుండి విలనిజం.. అక్కడి నుంచి హీరోయిన్ ప్రేమ, తోటి సైనికుల బాధను ఎంతో వైవిధ్యంగా ఎలివేట్ చేసిన విధానం ప్రశంసనీయం. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. అంత తక్కువ బడ్జెట్ లో, అంత మంచి అవుట్ పుట్ ఎలా ఇచ్చాడు అనేది చర్చనీయాంశం అవుతుంది.

వీళ్లిదారి తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ & మేకప్ వర్క్ గురించి చెప్పుకోవాలి. విక్కీ కౌశల్ దేహం మీద దెబ్బలను ప్రోస్థేటిక్స్ తో చాలా రియలిస్టిక్ గా చూపించిన విధానం అద్భుతం. విక్కీ తర్వాత అవార్డ్ గెలుచుకోవాల్సిన డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ గెరిల్లా యుద్ధ రీతులను భారీగా కాకుండా సహజంగా తెరకెక్కించేందుకు తోడ్పడిన విధానం అభినందనీయం.

లక్ష్మణ్ ఉటేకర్ చాలా సింపుల్ గా ఛావా పాత్రను ఎలివేట్ చేసిన విధానం.. ముఘలేయుల మాటల్లో అతడి గొప్పదనాన్ని వివరింపజేసిన తీరు మరాఠా ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రతి సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాతో బడా దర్శకుల జాబితాలో చేరిపోయినట్లే. యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా 5000 మంది ముఘల్ సైన్యంతో ఛావా పోరాడే సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం అద్భుతం అనే చెప్పాలి.

విశ్లేషణ: కొన్ని సినిమాలు థియేటర్ గేట్ దాకా గుర్తుంటాయి, కొన్ని సినిమాలు ఇంటికొచ్చేదాకా గుర్తుంటాయి. “ఛావా” (Chhaava) కొన్ని నెలలపాటు కళ్లల్లో మెదిలే సినిమా. విక్కీ కౌశల్ నట విశ్వరూపం, లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్, రెహమాన్ సంగీతం, యాక్షన్ కొరియోగ్రఫీ, మేకప్ వర్క్ వంటి అన్నీ అంశాలు మనసులో మెదులుతూ, మరోసారి థియేటర్లో చూడాలి అని పరితపించేలా చేస్తాయి. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హవా ఈ సినిమాతో మొదలవ్వడం ఖాయం.

ఫోకస్ పాయింట్: వాహ్ విక్కీ!

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Reviews

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

trending news

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

3 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

4 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

5 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

5 hours ago
Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

5 hours ago

latest news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

5 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

7 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

7 hours ago
Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

7 hours ago
Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version