భారతదేశ సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా స్థిరపడిన వారెందరో. తరుణ్, బేబీ షామిలి, బేబీ షాలినీ, మీనా ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మందే వున్నారు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పనిచేసిన వారు పెరిగి పెద్దవారై.. ఏ హీరోగానో, హీరోయిన్ గానో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని గురించి తెలుసుకునే క్రమంలో ఈ అబ్బాయి.. ఆ పిల్లాడా…?
ఎంత ఎదిగిపోయాడు అని మనమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. అలాంటి వారిలో ఒకడు గౌరవ్. ఇలా చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ కావొచ్చు. ప్రభాస్ – కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘డార్లింగ్’ లో హీరోయిన్ కాజల్ కి తమ్ముడిగా చేసిన ఆ పిల్లాడే ఈ గౌరవ్. డార్లింగ్ లో చేసిన ప్రతి ఒక్కరూ గుర్తుండిపోతారు. వారిలో ఈ పిల్లాడు కూడా ఒకడు. కాజల్ కి తమ్ముడిగా ప్రభాస్ ను ఆటపట్టిస్తూ ఉండే ఈ క్యారెక్టర్ ప్రేక్షకులను నవ్విస్తుంది.
ఇతను డార్లింగ్ కంటే ముందే ఎన్నో స్టేజ్ షోలలో ,డాక్యుమెంటరీలలో నటించాడు. తొలుత రవితేజ-అనుష్క జంటగా నటించిన ‘బలాదూర్’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన అద్భుత నటనతో దాదాపు 20 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా అలరించాడు. అయితే డార్లింగ్ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ బాబు పెరిగి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. నునుగు మీసాలు, గడ్డంతో మంచి ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే గౌరవ్ అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులను ప్రేక్షకులతో పంచుకుంటాడు. ఈ క్రమంలో హీరో అవ్వాలన్నది తన లక్ష్యమని చెబుతున్నాడు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు గౌరవ్ తెలిపాడు. చూద్దాం మరి ఆ అబ్బాయి కథనాయకుడిగా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో.