Chinmayi, Jr NTR: అభిమానాన్ని అర్ధం చేసుకోగలను కానీ.. అలా చేయడం కరెక్ట్ కాదు : చిన్మయి

తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడి, హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి పాపులర్ అయిన చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమంతకు కూడా ఎక్కువ సినిమాల్లో ఈమె డబ్బింగ్ చెప్పింది. ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సీతా రామం’ లో కూడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పోషించిన సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్ జాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఈమెనే..! అలాగే తమిళ స్టార్ లిరిసిస్ట్ వైరముత్తు పై మీటూ టైంలో ఆరోపణలు చేసి హాట్ టాపిక్ అయ్యింది.

ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ ఈమె ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో ఈమె ఎన్టీఆర్ విషయంలో ఓ హీరోయిన్ కి సపోర్ట్ చేసి అతని ఫ్యాన్స్ తో ట్రోలింగ్ కు గురైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మీరా చోప్రా. ‘బంగారం’ ‘మారో’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఓ సందర్భంలో ఎన్టీఆర్ అంటే ఎవరో తెలీదు అంటూ కామెంట్స్ చేసింది.

కొన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరిలో ఎవరు మంచి నటుడు అంటే ఈమె మహేష్ బాబు పేరు చెప్పింది. అప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఈమెను ట్రోల్ చేస్తుంటే చిన్మయి ఈమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అందుకు ఈమెను కూడా ట్రోల్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. తాజాగా ఈ విషయంపై చిన్మయి స్పందించింది. ఆమె మాట్లాడుతూ… “స్టార్‌ల పై అభిమానులకు ఉండే అన్ కండీషనల్ లవ్ ను నేను అర్ధం చేసుకోగలను.

దాని వల్ల ఇతరులను విమర్శించడం, దుర్భాషలాడడం కరెక్ట్‌ కాదు. ఎవరికి ఎవరు తెలియకపోతే ఏంటి?. యుఆర్‌ గోయింగ్‌, యుఆర్‌ వాచింగ్‌.. అందులో తప్పేం లేదు. వాళ్ళు నిజాయితీగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.తెలియజేసే హక్కు కూడా ఉంది. ఒకవేళ నిజంగానే తెలియకుంటే తర్వాత తెలుసుకుంటారు. అది కూడా తప్పు కాదు. అందుకే ఆ టైంలో ఆ హీరోయిన్ కు మద్దతు పలికాను” అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus