Chinmayi: హీరోయిన్ సమంత ఫోన్ ట్యాపింగ్.. సింగర్ చిన్మయి రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత (Samantha) ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు నటిగా ఎంత బిజీగా ఉన్నా మరోవైపు వ్యాపారాలలో సైతం రాణిస్తూ సమంత సత్తా చాటుతున్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తున్న సమంత తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. సమంత ఇమేజ్ కు భంగం కలిగేలా కొండా సురేఖ కామెంట్లు చేశారు.

Chinmayi

సింగర్ చిన్మయి (Chinmayi) స్పందిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియాకు సంబంధించిన వ్యక్తులు పెట్టిన వీడియోలు, పోస్టులు చూశానని ఆమె తెలిపారు. కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ మైలేజ్ ను పెంచుకోవడం కోసం డబ్బులు, క్లిక్స్, వ్యూస్ కోసం సమంత పేరును ప్రధానంగా ప్రస్తావించాయని చిన్మయి చెప్పుకొచ్చారు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే వీళ్లకు సమంత పేరు కావాలంటూ చిన్మయి పేర్కొన్నారు. అంతకు మించి మరో మార్గం లేదని ఆమె అన్నారు.

వీళ్ల కర్మ కాలిపోవాలని కోరుకోవడానికి నవరాత్రికి మించిన మంచి సమయం మరొకటి లేదని చిన్మయి చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ గురించి సమంత స్పందించాలంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా ఆమె ఎవరికీ జవాబులు చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ నాయకులు వాళ్ల నోటికొచ్చింది మాట్లాడతారని చేయల్సింది చేస్తారని వాళ్లు ఎవరూ జవాబుదారీగా ఉండరని చిన్మయి పేర్కొన్నారు.

మరోవైపు నాగచైతన్య (Naga Chaitanya) సైతం ఈ వివాదం గురించి ఒకింత ఘాటుగా స్పందించడం జరిగింది. సినీ ప్రముఖుల జీవిత నిర్ణయాలను హెడ్ లైన్స్ కోసం ఉపయోగించవద్దని చైతన్య అన్నారు. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని చైతన్య తెలిపారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అబద్ధమని చైతన్య పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలని చైతన్య కామెంట్లు చేశారు. చైతన్య చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus