ఖైదీ నంబర్ 150 తరవాత మెగాస్టార్ చిరంజీవి చేయనున్న మూవీ ఖరారు అయిపోయింది. ఆ చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా… చిరు ఏటీఎం.. అదేనండీ హీరో శ్రీకాంత్ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. అన్నయ్య తన 151వ సినిమాగా ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ”ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” కథను చేయనున్నాడని శ్రీకాంత్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారు. తెల్ల దొరలను ఎదురించి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆయన ఫ్యామిలీ గురించి ఓ టీవీ ఛానల్ వారు ప్రత్యేక కథనం ప్రసారం చేశారు. శ్రీకాంత్ స్వయంగా ఉయ్యాలవాడ గ్రామానికి వెళ్లి.. అక్కడ ఉయ్యాలవాడ వారి కుటుంబాన్ని కలసి.. ఆ కథను అందరికీ తెలిపే ప్రయత్నం చేశారు.
ఈ కథతో చిరంజీవి సినిమా చేస్తున్నారని చెప్పడంతో.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందపడ్డారని తెలిపారు. ఇలా ఈ విషయం బయటపడింది. 1840 లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టేందుకు మగధీర, బాహుబలి కి గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్ ని నిర్మాత రామ్ చరణ్ టీమ్ లోకి తీసుకున్నారు. హిస్టారికల్ మూవీని స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి 8 నెలల్లో కంప్లీట్ చేసి 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ శ్రమిస్తున్నారు. ఇందులో చిరు సరసన శృతిహాసన్ నటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.