మెగాస్టార్ మన్ననలు అందుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. ఆయన చేత కథ ఓకే చేయించుకోగలిగాడంటే ఆ దర్శకుడు హాలీవుడ్ లోనూ సినిమా తీసేయగలడు అని పరిశ్రమ పెద్దలు నవ్వుతూ చెబుతుంటారు. అలాంటిది ఒక్క కథ మాత్రమే కాక కథనం, కాస్ట్యూమ్స్, క్యాస్టింగ్, టెక్నికల్ యాస్పెక్ట్స్ వంటి అన్నీ విషయాల్లోనూ చిరంజీవిని ఆశ్చర్యానికి గురి చేస్తూ చిరంజీవి చేత “శభాష్ సురేందర్ రెడ్డి” అనిపించుకొంటున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “సైరా నరసింహారెడ్డి” చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు అన్న విషయం తెలిసిందే. “ధృవ” సినిమాని సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన తీరు, టెక్నికల్ అంశాలపై అతడికి ఉన్న పట్టు గ్రహించి రామ్ చరణ్ ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను సురేందర్ రెడ్డికి అప్పగించాడు.
చరణ్, చిరంజీవిలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా.. సినిమా కోసం అనునిత్యం కష్టపడుతూ బ్లాక్ బస్టర్ హిట్ కాదు అంతకుమించిన విజయాన్ని అందివ్వాలనే స్థాయిలో కష్టపడుతున్నాడు సురేందర్ రెడ్డి. అయితే.. ప్రీప్రొడక్షన్ వర్క్ కాస్త లేట్ అవ్వడంతో రెహమాన్, రవివర్మన్ లాంటి సీనియర్ టెక్నీషియన్స్ సినిమా నుంచి తప్పుకొన్నారు. అయినప్పటికీ.. అభిమానులు నిరాశ చెందలేదు, త్వరలోనే వారి స్థాయి టెక్నీషియన్స్ తో రీప్లేస్ మెంట్ జరుగుతుంది. చూస్తుంటే.. “సైరా నరసింహా రెడ్డి” చిత్రం తెలుగు సినిమా గర్వించదగ్గ స్థాయిలో రూపొందుతుందనిపిస్తుంది.