మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ కాంబినేషన్ లో ఏకంగా 14 సినిమాలకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, అడవి దొంగ సినిమాలను ఈ తరం ప్రేక్షకులు సైతం ఎంతో ఇష్టపడతారు.
మోసగాడు సినిమాతో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ మొదలైంది. ఈ సినిమాలో శోభన్ బాబు మెయిన్ హీరో కాగా ప్రాధాన్యత ఉన్న మరో పాత్ర కోసం చిరంజీవిని తీసుకున్నారు. అడవి దొంగ సినిమా విజయం వల్ల చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ కు మంచి పేరు వచ్చింది. ఆ సమయంలో చిరంజీవి రాఘవేంద్రరావు మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరగడం గమనార్హం. ఆ సమయంలో రాఘవేంద్రరావు చిరంజీవిని బాబాయ్ అని పిలిచేవారని సమాచారం.
రాఘవేంద్ర రావు సినిమాలతో చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మాస్ ప్రేక్షకులలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న చిరంజీవి మిగతా ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. తన డైరెక్షన్ లో నటించడానికి చిరంజీవి ఇబ్బంది పడకూడదని భావించి .రాఘవేంద్ర రావు అలా పిలిచేవారట. రాఘవేంద్ర రావు ఒక సందర్భంలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు.
హీరోలను దగ్గర చేసుకోవడం వల్ల హీరోల నుంచి మంచి నటనను రాబట్టవచ్చని అందుకే చిరంజీవిని తాను అలా పిలిచేవాడినని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. చిరంజీవి 67 సంవత్సరాల వయస్సులో కూడా తన నటనతో అదుర్స్ అనిపిస్తున్నారు. భోళా శంకర్ సినిమాతో ఈ ఏడాది చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్లు సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?