గతేడాది లాక్‌డౌన్ ఏర్పడినప్పుడు ఓటిటిల డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లు తెచ్చుకున్నప్పటికీ వాటి హవా తగ్గలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ థియేటర్లు మూతపడడంతో… మళ్ళీ ఓటిటి ల జోరు ఊపందుకుంది. ఇక్కడ విడుదలయ్యే వెబ్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. దీంతో స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఓటిటిల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్ వంటి అగ్ర హీరోలు మొదటి స్టెప్ వేయడానికి రెడీ అయినట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.ఆల్రెడీ అల్లు అరవింద్ గారు ఆహా ఫ్లాట్ ఫామ్‌లో చిరు కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు ప్రచారం మొదలైంది.కరోనా తీవ్రత తగ్గిన వెంటనే ఆ ప్రాజెక్టు మొదలవుతుందని సమాచారం. ఇంకోపక్క సురేష్ బాబు కూడా తన తమ్ముడు వెంకటేష్‌తో ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
స్టోరీ డిస్కషన్లు కూడా మొదలైనట్టు వినికిడి. ఇందులో భాగంగా దర్శకుడు తేజ చెప్పిన ఓ కథ కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే వీటి కోసం పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకునేందుకు ఈ ఇద్దరు స్టార్లు కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఏమైతేనేం ఇది నిజంగా డేర్ స్టెప్ అనే చెప్పాలి. మరి భవిష్యత్తులో చిరు,వెంకీ ల లానే మరింత మంది హీరోలు ఓటిటి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.