Chiranjeevi, Anil Ravipudi: మరో దర్శకునికి మెగాస్టార్ ఓకే చెప్పారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. వరుసగా యంగ్ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్న చిరంజీవి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీకి చెందిన వారిని సైతం షాకయ్యేలా చేస్తున్నారు. అనిల్ బాలయ్య కాంబో మూవీ పూర్తైన తర్వాత అనిల్ చిరంజీవి కాంబో మూవీ పట్టాలెక్కనుంది. ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొనే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను వేగంగా పూర్తి చేసి బాబీ సినిమాను చిరంజీవి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. బాబీ సినిమాతో పాటే చిరంజీవి మారుతి సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత చిరంజీవి అనిల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా సినిమాల్లో నటించాలని చిరంజీవి భావిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus