స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది. ఇదిలా వుండగా ఏప్రిల్ 10 న విశాఖపట్నం లో అత్యంత భారీగా ఆర్.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో పూర్తి ఎల్.ఇ.డి స్క్రీన్స్ తో మెట్టమెదటి సారిగా ఆడియో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏప్రిల్ 3 న విశాఖపట్నం లో ఢాల్ఫిన్ హోటల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ గారు, ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు గారు హజరయ్యారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చాలా కాలం నుండి గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ లో ఏదైనా పెద్ద సినిమా ఫంక్షన్ చేయాలని కొరుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కి అన్ని ఏరియాల కంటే వైజాగ్ లో మంచి మార్కెట్ వుంది. బన్ని కి వైజాగ్ తొ మంచి అనుభందం వుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ లో ఇదే అతి పెద్ద ఫంక్షన్ గా వుండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. బన్ని, ముగ్గురు హీరోయిన్స్ హజరవుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఫెర్‌ఫార్మెన్స్ చేయబోతున్నాడు. ఇంకా చాలా టాలెంట్‌డ్ షో లు చేస్తున్నాము. ఆంద్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ జరగటానికి, అలాగే షూటింగ్స్ కూడా జరగటానికి అన్ని విధాల సహయసహకారాలు అందిస్తాము. మా సరైనోడు చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10 న ఆడియో సెలబ్రేషన్స్ జరుపుతున్నాము.అని అన్నారు.
మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పటినుండో ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా షూటింగ్ లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నాము. ఇప్పటికిప్పుడే అది కుదరకపోయినా పెద్ద చిత్రాల షూటింగ్స్, ఈవెంట్స్ ఇక్కడ జరిగాలని కోరుకున్నాము. దీని కోసం చిరంజీవి గారిని ఇతర హీరోల్ని కూడా సంప్రదించటం జరిగింది. హీరోల కో-ఆపరేషన్ లేకుంటే అది సాధ్యపడదు. అల్లు అర్జున్ సరైనోడు ఫంక్షన్ ఇంత భారీగా చేస్తున్నందుకు చాలా దన్యవాదాలు. తనకి వైజాగ్ అంటే చాలా ఇష్టమని ఇక్కడ స్టూడియో కట్టాలనుకుంటున్నాను అని చెప్పారు. అలాగే రామ్ చరణ్ , నందమూరి బాలకృష్ణ కూడా స్టూడియో కట్టాలనే ఆలోచన వున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో జరిగినట్టు ఐఫా అవార్డు ఫంక్షన్ లు ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాము. సినిమా ఫంక్షన్స్ , షూటింగ్స్ కి పర్మిషన్స్ సింగిల్ విండో పద్దతిలో ఇచ్చేస్తామని. సినిమా ఇండస్ట్రికి ఎటువంటి సహయాన్నైనా అందిస్తాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మెగా హీరోలందరికి, అభిమానులకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము.. అని అన్నారు.