Chiru, Balayya: చిరు, బాలయ్యలతో స్పెషల్ ఇంటర్వ్యూ.. కుదురుతుందా..?

ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ‘వాల్తేర్ వీరయ్య’ ప్రెస్ మీట్ లో ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయంటూ.. చిరంజీవి కూడా బాలకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. చిరంజీవి, బాలకృష్ణల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇదివరకు బాలయ్య.. ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండేది చిరంజీవితోనే అని చెప్పారు. సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల సినిమాలు రాబోతున్నాయి. దీంతో ఈ ఇద్దరు హీరోలను కలిపి ఓ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ కు ముందు ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల ప్రమోషన్ ని ఒకే వేదికపై నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. అయితే దీనికి చిరంజీవి, బాలకృష్ణ ఒప్పుకోవాలి. తమ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్న సమయంలో చిరంజీవి, బాలయ్య కలిసి ఒకే ఇంటర్వ్యూలో కనిపిస్తే ఓ రేంజ్ లో బజ్ వస్తుంది. ఒక మంచి సంప్రదాయానికి తెర తీసినట్లు అవుతుంది.

అభిమానుల మధ్య కూడా ఈగో గొడవలు తగ్గుతాయి. మరి దీనికి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఓకే చెబుతారో లేదో చూడాలి. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి దిగుతున్నాయి. అందులో ఒకటి విజయ్ ‘వారసుడు’ కాగా.. మరొకటి అజిత్ ‘తునివు’. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus