#TeluguIndianIdol: ఇండియన్ ఐడల్ తెలుగు సెమీ ఫినాలేకి బాలయ్య.. ఫినాలేకి చిరు..!

‘ఆహా’ ఓటీటీ సంస్థ ‘ఇండియన్ ఐడల్’ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో దాగి ఉన్న టాలెంటెడ్ సింగర్లను వెలికి తీయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేయడం తమన్, నిత్యా మేనన్.. వంటి స్టార్లు జడ్జిలుగా వ్యవహరించడంతో ఈ షో జనాలను ఆకర్షించింది. ఇక ఈ షో తుది దశకు చేరుకుంది.

సెమీ ఫినాలే ఎపిసోడ్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా విచ్చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే.కంటెస్టెంట్లకు కొన్ని బహుమతులు కూడా ఇచ్చాడు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.28వ ఎపిసోడ్ గా ఇది స్ట్రీమింగ్ కాబోతుండగా 6 మంది సింగర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. వాళ్ళే లాలస, వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్. వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇక ఫినాలే ఎపిసోడ్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెరుగుతుంది అని చెప్పొచ్చు. సెమీ ఫైనల్ లో మిగిలిన 3మంది కంటెస్టెంట్ లు ఇందులో పాల్గొంటారు. అందులో ఒక్కరు టైటిల్ విన్నర్ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి.. ఇలాంటి షోలకి హాజరు కావడం కొత్తేమీ కాదు.

గతంలో ‘బిగ్ బాస్ 3’ ఫినాలేకి, అలాగే ‘బిగ్ బాస్ 4’ ఫినాలేకి ఆయన గెస్ట్ గా హాజరయ్యారు. ‘ఆహా’ వారు సమంతతో నిర్వహించిన సామ్ జామ్ లో కూడా పాల్గొన్నారు చిరు. ఇప్పుడు ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus