Chiranjeevi: వైరల్‌ అవుతున్న చిరు స్టేట్‌మెంట్స్‌.. ఎవరి కోసం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు పూర్తై… తుది ఫలితాలు విడుదలవుతున్న సమయం అది. ‘పెళ్లి సందD’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ జరుగుతోంది. అప్పుడే చిరంజీవి మైక్‌ అందుకున్నారు. ఏవేవో చెప్పుకుంటూ వచ్చి… టాపిక్‌ ఇండస్ట్రీలో సఖ్యత, స్నేహం గురించి వచ్చింది. దీంతో ఆడిటోరియంలోను, టీవీలో చూస్తున్న ఇళ్లలోనూ, యూట్యూబ్‌లో చూస్తున్న కుర్రాళ్లలో చిన్న ఆసక్తి. చిరంజీవి టాపిక్‌ను ఎటు తీసుకెళ్తున్నారు అని. అలా చిరంజీవి కొన్ని వైరల్‌ కామెంట్స్‌ చేశారు.

చిరంజీవి ఎందుకున్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది తర్వాత చూద్దాం. ముందు చిరు ఏమన్నారో చదివేయండి. ‘‘నారప్ప’ సినిమా నాకు బాగా నచ్చింది. సినిమా చూసిన వెంకటేశ్‌ని అభినందించాను. తనకి నేను నటించిన ‘సైరా’ బాగా నచ్చి, నన్ను మెచ్చుకున్నాడు. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలనడం, అనిపించుకోవడం ఉండదు. ఏ పదవైనా తాత్కాలికమే. రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా? మహా అయితే నాలుగేళ్లుంటాయి’’ అంటూ పదవుల గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి.

‘‘అలాంటి పదవుల కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటవారికి ఎంత లోకువ అయిపోతామో ఆలోచించండి. అసలు పదవి కోసం అంత లోకువ అవ్వాలా? ఇలాంటి పరిస్థితి చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ విషయంలో నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించడం లేదు. మన ఆధిపత్యం చూపించుకోవడానికి ఎదుటవారిని కించపరచాల్సిన అవసరం లేదు. అసలు ఈ మొత్తం ప్రాసెస్‌ ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఇలాంటి వివాదాలు మొదలయ్యాయో ఆలోచించండి. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితే’’ మంచిది అని చిరంజీవి అన్నారు.

ఇప్పుడు అసలు మేటర్‌కి వద్దాం. అసలు చిరంజీవి చెప్పిన ఆ వ్యక్తి ఎవరు. ఇండస్ట్రీలో గొడవులు, వివాదాలు, విభేదాలకు కారణం ఎవరు. ఈ మొత్తం ప్రాసెస్‌ ఎక్కడ మొదలైంది అని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి నేరుగా చెప్పకపోయినా… ఆయన చెప్పింది ‘మా’ ఎన్నికల గురించే అని అందరికీ తెలిసిందే. ‘మా’ ఎన్నికల విషయం తొలుత మొదలుపెట్టింది ప్రకాశ్‌రాజే కావొచ్చు. కానీ వివాదాలు, మాటల యుద్ధాలు మాత్రం మంచు విష్ణు ప్యానల్ నుండి వచ్చాయి. అందులో విష్ణు నేరుగా స్పందించిన అంశాలు తక్కువే. మరి చిరంజీవి చెప్పిన ఆ మాటల ‘సారథి’ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది.

‘మా’ ఎన్నికల విషయంలో మాటల తూటాలు పేల్చినవాళ్లలో పేర్లు కూడా ఓసారి గుర్తు చేసుకుందాం. సాఫీగా సాగుతున్న ‘మా’ ఎన్నికల వ్యవహారంలో బండ్ల గణేశ్‌, సీవీఎల్‌ నరసింహారావు, జీవిత, నరేశ్‌, హేమ, పృథ్వీరాజ్‌, నాగబాబు, కోట శ్రీనివాసరావు, రవిబాబు, కరాటే కళ్యాణి … ఇలా చాలామంది నోరు చేసుకున్నారు. ఈ పేర్లు జస్ట్‌ సమాచారం కోసం మాత్రమే. ఇందులో ఎవరైనా చిరంజీవి మాటలు విని ‘పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ ముందుకొస్తారేమో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus