Chiranjeevi: అనిల్ స్పీడ్ కి బ్రేకులు వేసిన చిరు.. !

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాని చాలా వరకు కంప్లీట్ చేశారు. కానీ జనవరిలో వాయిదా వేసిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది లేదు. మే 9న రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. తర్వాత జూలై 24 అన్నారు. ఇప్పుడు చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22కి విడుదల చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క అనిల్ రావిపూడి  (Anil Ravipudi)  సినిమాని చాలా సైలెంట్ గా స్టార్ట్ చేసేశారు చిరు.

Chiranjeevi

సాధారణంగా అనిల్ రావిపూడి.. షూటింగ్ టైం నుండి ఏదో ఒక వీడియో చేసి ప్రమోషన్ కోసం వాడతారు. కానీ ఈసారి అలా చేయలేదు. చాలా సైలెంట్ గా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. అందుకు చిరంజీవి పెట్టిన షరతులు కారణమనేది ఇన్సైడ్ టాక్. ‘విశ్వంభర’ కి సంబంధించి కొంత వి.ఎఫ్.ఎక్స్ వర్క్ నడుస్తుంది. అలాగే దానికి నాన్- థియేట్రికల్ బిజినెస్ కూడా కంప్లీట్ అవ్వలేదు.

దానికి తోడు మెగా అభిమానులకు ఆ సినిమాపై ఉన్న క్రేజ్ కూడా సన్నగిల్లుతుంది. మరోపక్క అనిల్ రావిపూడి సినిమా పై రోజు రోజుకీ నమ్మకం పెరుగుతుంది. మీడియాలో కూడా ఎక్కువగా ‘విశ్వంభర’ కంటే అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడిని చిరు కంట్రోల్ పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న షెడ్యూల్ ముగిసిన వెంటనే ‘విశ్వంభర’ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారు చిరు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. తిరిగొచ్చాక అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో గ్యాప్ లేకుండా గడుపుతారు. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ జరుపుతున్నాడు అనిల్ రావిపూడి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus