Chiranjeevi, Meher Ramesh: మెహర్ రమేష్ కు మెగాస్టార్ పెట్టిన షరతు ఇదే!

స్టార్ హీరో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తూ 2022 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలు రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్య రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను కూడా వచ్చే ఏడాది విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన భోళా శంకర్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుండగా 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కేవలం 40 నుంచి 50 రోజుల్లో పూర్తి చేయాలని చిరంజీవి మెహర్ రమేష్ కు షరతులు విధించినట్టు తెలుస్తోంది. అయితే అంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తైతే సినిమా ఔట్ పుట్ పై ప్రభావం పడుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు మెహర్ రమేష్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.

షూటింగ్ ఆలస్యంగా పూర్తైనా పరవాలేదని రీఎంట్రీలో చిరంజీవి నటించబోయే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కావడం తమకు ఇష్టం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus