టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఆచార్య సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వీక్ డేస్ లో ఆచార్య సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు పరవాలేదనిపించేలా ఉన్నా ఏ సెంటర్లలో మాత్రం ఈ సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. చిరంజీవి, చరణ్ తమను ఆదుకుంటారని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఆచార్య సినిమాను మొదట మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటన వెలువడినా నిరంజన్ రెడ్డి మాత్రమే ఈ సినిమాకు సోలో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ప్రముఖ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి ఆచార్య సినిమా వాయిదా పడటం వల్ల ఈ సినిమా వడ్డీల కోసమే ఏకంగా 50 కోట్ల రూపాయలు చెల్లించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఆచార్య శాటిలైట్, డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినా నిర్మాతలకు కొంతమేర నష్టాలు రావడం గ్యారంటీ అని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి, చరణ్, కొరటాల శివ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తక్కువ రెమ్యునరేషన్ తో, పరిమిత బడ్జెట్ తో చిరంజీవి మరో సినిమా చేస్తే మాత్రమే నిర్మాత కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
మరి చిరంజీవి ఈ దిశగా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఆచార్య ఎఫెక్ట్ చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా కొంతమేర పడిందని తెలుస్తోంది. మరీ భారీ బడ్జెట్ సినిమాలు చేసే విషయంలో చిరంజీవి సైతం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. చిరంజీవి నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వేగంగా జరుగుతుండగా గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
లూసిఫర్ సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆచార్య రిజల్ట్ గురించి మెగాస్టార్ స్పందన ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!