పాటనే ప్రాణంగా భావించి తన అద్భుతమైన గాత్రంతో,వివిధ భాషలలో కొన్ని వందల పాటలు పాడుతూ తన తియ్యని గాత్రంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న గాయకుడు కృష్ణ కుమార్ కన్నత్ అకాల మరణం సినీ ప్రేమికులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.పాటనే ప్రాణంగా భావించే కేకే తుదిశ్వాస వరకు పాటలు పాడుతూ మరణించడం అందరిని శోకసంద్రంలో ముంచేసింది. మంగళవారం సాయంత్రం కేకే కోల్‌కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన తరువాత..
ది గ్రాండ్ హోటల్‌లో గుండెపోటుకు గురికావడం అది గమనించిన ఈయన సహాయకులు తనని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గాయకుడు కేకే మరణవార్తను తెలుసుకున్న పలువురు ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు సైతం కేకే మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కేకేతో తనకు ఉన్న అనుబంధం ఆయన పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ స్పందిస్తూ… కేకే మరణవార్త వినగానే గుండె ముక్కలయింది. ఎంతో గొప్ప సింగర్ గా పేరు సంపాదించుకున్న కేకే మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమాలో తాను పాడిన దాయి దాయి దామ్మా పాటను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ కేకే ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.
Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!