Chiranjeevi,Pawan Kalyan: పవన్ కు ఆ విషయంలో భరోసా ఇచ్చిన చిరంజీవి.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూట్ హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్ లో జరుగుతోంది. విశ్వంభర షూటింగ్ సెట్ కు పవన్ (Pawan Kalyan) , నాగబాబు (Naga Babu) వెళ్లి చిరంజీవిని కలవగా చిరంజీవి ఆత్మీయ ఆలింగనంతో ఇద్దరు సోదరులకు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆయన అశీ ర్వాదం తీసుకున్నారు. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం గమనార్హం.

పవన్ కు నేనున్నానంటూ చిరంజీవి భరోసా ఇవ్వడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి విరాళానికి సంబంధించిన చెక్కును పవన్ కు అందజేశారు. తొలిసారి చిరంజీవి పవన్ కు డైరెక్ట్ గా జనసేన విషయంలో సపోర్ట్ చేయడం మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు విశ్వంభర మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా చెప్పిన సమయానికి కచ్చితంగా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విశ్వంభర సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. భోళా శంకర్ (Bhola Shankar) అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన నేపథ్యంలో భవిష్యత్తు సినిమాల విషయంలో చిరంజీవి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమా మరో జగదేకవీరుడు అతిలోక సుందరి అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రిష (Trisha) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus