Chiranjeevi, Samantha: ‘డియర్ సామ్..’ మెగాస్టార్ ఎమోషనల్ రియాక్షన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి, జనాలకు దూరంగా ఉంటోంది. బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. దానికి తగ్గట్లే మీడియాలో ఆమె అనారోగ్యంతో బాధ పడుతుందని వార్తలొచ్చాయి. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందిస్తూ.. తన పరిస్థితి గురించి వివరించింది సమంత. కొన్నాళ్లుగా మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు చెప్పింది.

నిజానికి ఇదొక ప్రాణాంతక వ్యాధి. మజిల్స్ లో వాపులు రావడం, విపరీతమైన నొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతం సమంతకు ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ పోస్ట్ లతో ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్, రాశి ఖన్నా, అఖిల్, నాని ఇలా చాలా మంది సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో సమంతను ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ‘డియర్ సామ్..’ అని పిలుస్తూ.. ఎంతో ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ‘కాలానుగుణంగా మన జీవితాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అది మన ఇన్నర్ స్ట్రెంగ్త్ కలుగొనడానికి వీలు కల్పిస్తుంది. నువ్ ఒక వండర్ ఫుల్ అమ్మాయివి.

నీలో ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. నువ్ కచ్చితంగా ఈ సవాల్ ను ఎదుర్కోగలవని నేను అనుకుంటున్నాను. కచ్చితంగా అధిగమిస్తావు కూడా. నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇది చూసిన సమంత.. చిరంజీవికి థాంక్స్ చెబుతూ బదులిచ్చింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus