Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఇంటర్వ్యూ : ‘గాడ్ ఫాదర్’ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

ఇంటర్వ్యూ : ‘గాడ్ ఫాదర్’ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • October 14, 2022 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ :  ‘గాడ్ ఫాదర్’ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్ మూవీ దసరాకి రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీకోసం :

మీరు చూడని ఇండస్ట్రీ హిట్స్ కానీ, బ్లాక్ బస్టర్స్ కానీ లేవు? మరి ‘గాడ్ ఫాదర్’ విజయాన్ని ఎలా భావిస్తారు?

సినిమా అనేది సమిష్టి కృషి అని నేను నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి ఉంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్ లో వచ్చిన నా గత చిత్రం నిరాశ పరిచింది.

‘ఆచార్య’ విషయంలో మీరు తీసుకున్న స్టెప్ ఏంటి?

దానికి చేయవలసిన ధర్మం చేశాను. అది చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాఫ్ కి క్రుంగిపోయేలా చేయలేదు. గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాది అని అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. లూసిఫర్ ని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన ఉండేది.

‘గాడ్ ఫాదర్’ ప్రయాణం ఎలా మొదలైంది?

చరణ్ ఒక రోజు ‘లూసిఫర్’ ప్రస్తావన తీసుకొచ్చాడు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే ‘లూసిఫర్’ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పారట. చరణ్ బాబు ఇలా చెప్పిన తర్వాత మరోసారి లూసిఫర్ చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు (నవ్వుతూ). తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. తని ఒరువన్ ని అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ రీమేక్ మోహన్ రాజా న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. మోహన్ రాజాకి కూడా ఇది ఇష్టమైన సబ్జెక్ట్. చేస్తానని చాలా ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యానంద్ తో కూర్చుని టీం అంతా చాలా చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ని అద్భుతంగా మలిచారు.

‘గాడ్ ఫాదర్’ చూశాక ఇండస్ట్రీ నుండి మీ మిత్రులు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ?

నాగార్జున, వెంకటేష్.. ఇలా దాదాపు అందరూ కాల్ చేసి నాతో మాట్లాడారు. దాదాపు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

‘లూసిఫర్’ అనేది సాంగ్స్ , డాన్స్ లేని సబ్జెక్ట్ కదా… మీ అభిమానుల ఎలా తీసుకుంటారని భావించారు? ఇప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది అని భావిస్తారు ?

పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్ లు చేస్తే బావుంటుందని మాటే తప్ప సాంగ్స్ , డాన్స్ లు లేవని ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినపుడు పాటలు లేవనే భావం కలగలేదు. దీనికి కారణం తమన్. నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. యాక్షన్ సీన్స్ కి ఇంత హై రావడానికి కారణం తమన్ మ్యూజిక్. ఈ సినిమాని గాడ్ ఫాదర్ అనే టైటిల్ సూచించింది కూడా తమనే.

‘లూసిఫర్’ తో పోల్చుకుంటే ‘గాడ్ ఫాదర్’ లో చాలా మార్పులు చేశారు ? ఇలా మార్పులు చేసినప్పుడు ఒరిజినల్ దెబ్బ తింటుందనే భయం కలగలేదా ?

ఎలాంటి మార్పులు చేస్తే ఫ్రెష్ గా ఆసక్తికరంగా ఉంటుందనే ఆలోచనతో పని చేశాం. ఇది పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా ఉంటుందో లేదో తెలీదు. అయితే దీని వెనుక బలమైన ఎమోషన్ ఉంది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ప్రధానంగా ఉంటూ మరో లేయర్ లో పొలిటికల్ డ్రామా ఉండాలని మొదటిరోజే అనుకున్నాం. మలయాళంలో సొంత కొడుకా కాదా అనే అనుమానం ఉంటుంది. కానీ గాడ్ ఫాదర్ లో సొంత కొడుకని చాలా క్లియర్ గా చెప్పాం.

అలాగే బ్రదర్ ని సిస్టర్ ఎందుకు ద్వేషిస్తుంది అనే విషయాన్ని కూడా వివరంగా చూపించాం. అలాగే తన సిస్టర్ ని బ్రహ్మ పార్టీ ప్రెసిడెంట్ చేయడం కూడా చాలా ఆసక్తికరమైన సన్నివేశం అయ్యింది. ఈ మార్పులన్నీ మోహన్ రాజా అద్భుతంగా చేసి ప్రేక్షకులని కట్టిపడేశారు. మనం అనుభవంతో ఏదైనా మార్పు చెబితే మోహన్ రాజా దాన్ని చాలా గొప్ప గా స్వాగతించి దాని గురించి ఆలోచిస్తాడు.

ఇది అతనిలో చాలా మంచి లక్షణం. రీమేక్ సినిమా చేయడం ఒక సవాల్. చాలా పోలికలు వస్తాయి. అయితే ప్రేక్షకుల ఆదరణ వలన ఒరిజినల్ ని మర్చిపోయేలా చేయగలుగుతున్నాం. ఘరానా మొగుడు, ఠాగూర్ .. చిత్రాలు గొప్ప విజయాలు అందుకొన్నాయి. రీమేక్ కథలలో నా పాత్ర, ప్రజంటేషన్ సరికొత్తగా ఉంటుంది. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వుంటుంది. (నవ్వుతూ) గాడ్ ఫాదర్ లో కూడా అది అద్భుతంగా కుదిరింది.

సత్యదేవ్ , పూరి జగన్నాథ్ , సర్వదమన్ బెనర్జీ ఈ ప్రాజెక్టులోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

సర్వదమన్ బెనర్జీ ఇందులో సీఎం పాత్ర ఆయన అయితే బాగుంటుందని అనుకున్నాం. అయితే తను చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్నారు. మా కోరిక మేరకు నటించడానికి ఒప్పుకున్నారు. ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. పూరి జగన్నాథ్ కూడా అంతే. ఇందులో యూట్యూబర్ పాత్రలో నటించమని అడిగితే మొదట టెన్షన్ పడ్డారు. తర్వాత ఒప్పుకున్నారు. జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ అతని కోరిక మీద నుండి వచ్చిందని అనుకోవచ్చు.

సత్యదేవ్ చాలా టాలెంట్ ఉన్న నటుడు. ఈ పాత్ర చేయమని నేనే తనకి కథ చెప్పా. తను షాక్ అయ్యాడు. ”మీరు చేయమని అడిగితే చేసేస్తాను అన్నయ్య నాకు ఎందుకు కథ చెబుతున్నారు.. నాకు అంతా బ్లాంక్ గా ఉంది” అన్నాడు. వావ్ అనేలా తన పాత్ర చేశాడు. తన ప్రజంటేషన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. నయనతార ఈ కథకు మరో ఆకర్షణగా నిలిచారు. చాలా అద్భుతంగా చేసింది.

ఇందులో నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించారు. మోహన్ రాజా సల్మాన్ ఖాన్ అయితే బావుంటుందని అన్నారు. చరణ్ బాబు సల్మాన్ తో మాట్లాడారు. సల్మాన్ మాపై ఎంతో ప్రేమతో మరో ఆలోచన లేకుండా ” చిరు గారు కోరితే నేను నటించడానికి రెడీ” చెప్పాడు.

రీమేక్ సినిమా అయినా ఠాగూర్ లో పాటలు డ్యాన్సులు పెట్టారు .. కానీ లూసిఫర్ లో ఆ హంగులు లేకుండా తీశారు కదా?

ప్రేక్షకుల అభిరుచి కాలానికి తగ్గట్టు మారుతోంది. బలమైన కథనం ఉంటే పాటలు, ఫైట్లు లేకపోయినా దానికి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే ‘గాడ్ ఫాదర్’ ని రూపొందించాం. ప్రేక్షకులు దీనిని గొప్పగా ఆదరిస్తున్నారు. మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు రావడానికి ఇది మంచి సంకేతంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలని ప్రయత్నిస్తాను.

‘సైరా’ లా మీకు ఇంకేమైనా డ్రీం ప్రాజెక్టులు ఉన్నాయా?

మైత్రీ మూవీ మేకర్స్ , బాబీ దర్శకత్వంలో రాబోతున్న 154 లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే చిత్రంగా ఆకట్టుకుంటుంది. అలాగే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం ఉంటుంది.

ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వున్నారు .. వరుసగా సినిమాలు చేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు ?

ప్రేక్షకులు, ఇండస్ట్రీ… నన్ను ఎంతగానో ఆదరించిన సంగతి మీ అందరికీ బాగా తెలుసు. వారు ఇచ్చిన ప్రేమ,అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నాను. వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను. కృతజ్ఞత తీర్చుకునే విధానంలో ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

యంగ్ డైరెక్టర్స్ తో పని చేయడం ఎలా అనిపిస్తుంది?

ఇప్పుడున్న యువ దర్శకులకు చాలా తెలుసు.అన్ని విభాగాల్లోనూ అలాగే టెక్నికల్ గాను చాలా విషయాలు తెలుసు. వారు కోరుకున్నది ప్రజెంట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు వున్నాయి. నా ఇమేజ్, వారు కొత్త గా చూపించే విధానం ఈ కాంబినేషన్ బాగుటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను.

మీరు పవన్ కళ్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా ?

మా తమ్ముడి తో చేయాలని నాకు ఉంది. అన్నయ్యతో చేయాలని తనకీ ఉంటుంది. అన్నీ కుదిరిన రోజున కలిసి సినిమా చేయాలనే ఉత్సాహం ఇద్దరిలోనూ ఉంది.

ఈ మధ్య దర్శకులు సెట్స్ లో డైలాగులు రాస్తన్నారని అన్నారు కదా ? ఇది చాలా వైరల్ అయ్యింది .. దాని గురించి?

ఈ మధ్య అనలేదండీ. నేను జనరల్ గా ఆ మాట అన్నాను. కానీ దానిని వేరేలా ఆపాదించుకున్నారు. నేను ఏ సినిమాని ఉద్దేశించి ఆ మాట చెప్పలేదు. జనరల్ గా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పడమే నా ఉద్దేశం. గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మోహన్ రాజా అద్భుతమైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. దీని వలన సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి.

సల్మాన్ ఖాన్ గారు గాడ్ ఫాదర్ చేశారు కదా మీకూ వేరే పరిశ్రమ నుండి అవకాశం వస్తే చేస్తారా ?

వై నాట్… తప్పకుండా చేస్తాను.! అందరూ చేయాలని కోరుకుంటాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా ‘ఇండియన్ సినిమా’ అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జి ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం.

మీరు కొన్ని విషయాల్లో తగ్గడం… మీ అభిమానులకు ఇష్టం ఉండదు. దానిని మీరు ఎలా తీసుకుంటారు?

ఇక్కడ తగ్గడం అని కాదు. సంయమనం పాటించడం. ‘నిజాలు నిలకడగా తెలుస్తాయి’ అనే మాటని నేను ఎక్కువగా నమ్ముతాను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్ళీ వారి తప్పును తెలుసుకొని నా దగ్గరికి వస్తే వారిని ప్రేమగా దగ్గర తీసుకుంటాను. నాకు తెలిసిన ఈ ఫిలాసఫీతో ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

related news

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

56 seconds ago
Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

2 hours ago
Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

4 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

19 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

20 hours ago

latest news

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

37 mins ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

52 mins ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

2 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

3 hours ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version