Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  ప్రస్తుత లైనప్‌ చూసిన తర్వాత ఈ పుకారు నిజమవ్వొచ్చా? అవకాశం ఉందా? అనే చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు జరిగిన ఓ చిన్న కార్యక్రమం ఆ పుకార్లకు బలం చేకూర్చేలా ఉంది. ఆ సినిమా దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబీ)కి (K. S. Ravindra) చిరంజీవి ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చారు. అదే స్పెషల్‌ స్విస్‌ ఒమేగా వాచ్‌.

Chiranjeevi

దీని ధర పదుల లక్షల రూపాయాల్లోనే ఉంటుంది. ఇక్కడ విషయం గిఫ్టే కానీ.. ప్రశ్న వేరు. ఇప్పుడు ఎందుకు గిఫ్ట్‌ ఇచ్చినట్లు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయం నేపథ్యంలో ఇచ్చారు అనుకుంటే.. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. అలాగే ఆ సినిమాకు సంబంధించిన గిఫ్ట్‌ ఎప్పుడో ఇచ్చేశారు అని సమాచారం. అప్పట్లో ఈ మేరకు వార్తలొచ్చాయి కూడా. ఇప్పుడు ఎందుకు గిఫ్ట్‌, ఏంటా స్పెషల్‌ అనేదే ఇక్కడ ప్రశ్న.

దీనికి ఆన్సర్‌ మరో సినిమా ఇద్దరూ చేస్తున్నారు అనే మాట చెప్పొచ్చు. అయితే మరి అఫీషియల్‌గా ప్రకటించొచ్చు కదా అని అంటారా?ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది అంటున్నారు. బాబీ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. కానీ ఇంకా నిర్మాత ఎవరూ ఫైనల్‌ అవ్వలేదు అని చెబుతున్నారు. చిరంజీవి సినిమా అంటే నిర్మాతలు ఈజీగానే ముందుకొస్తారు. కానీ ఈ సినిమా విషయంలో ఇంకా ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదు అని అంటున్నారు.

దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. గతంలో బాబీ చేసిన సినిమాల బడ్జెట్‌ ఊహించని విధంగా పెరిగింది అని అంటుంటారు. ఇప్పుడు అదే కారణమవ్వొచ్చు అని సమాచారం. ఈ నేపథ్యంలో బాబీని పిలిచి చిరంజీవి ఆ వాచీని ఇచ్చారు అని చెబుతున్నారు. త్వరలో నిర్మాత వ్యవహారం తేలాక ప్రకటన ఉండొచ్చు అని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus