తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి సారి ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చిత్రాలు కలక్షన్ల వర్షం కురిపిస్తాయి కాబట్టి నిర్మాతలు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడేవారు. తొమ్మిదేళ్ల తర్వాత హీరో గా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నంబర్ 150 కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ స్టార్ సత్తా చూపింది. ఇప్పుడు చిరంజీవి బుల్లితెర లో రికార్డులను నెలకొల్పడానికి రెడీ అవుతున్నారు. ఆయన హోస్టుగా చేసిన తొలి షో “మీలో ఎవరు కోటీశ్వరుడు(సీజన్ 4 )” కోసం తెలుగురాష్ట్రాలలోని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి మాటీవీ లో ప్రసారం కానున్న ఈ షోలో తొలి గెస్ట్ గా గత హోస్ట్ అక్కినేని నాగార్జున రానున్నారు.
ఇక ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజున చిరు తన కుటుంబ సభ్యులతో షో ని సరదాగా నడిపించనున్నారు. ఆ తర్వాత పార్టిసిపేట్స్ తో కోటీ రూపాయల గేమ్ ఆడనున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ షోలో ఒక ఎపిసోడ్ కి బాస్ పది లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గంట ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కి పది లక్షలు తీసుకోవడం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి. షో టెలికాస్ట్ కి ముందే రెమ్యునరేషన్స్ విషయంలో రికార్డులను బద్దలుకొట్టిన ఈ షో.. ప్రసారం అయినప్పుడు ఇంకెన్ని రికార్డులను షేక్ చేస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.