Chiranjeevi, Bobby: మెగాస్టార్ బాబీకి కారు ఇవ్వడానికి కారణం ఇదేనా?

  • January 19, 2023 / 04:11 PM IST

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా రికార్డ్ స్థాయిలో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ ను సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే రీఎంట్రీలో తనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీకి చిరంజీవి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు విలువ 2 కోట్ల రూపాయలు అని సమాచారం.

సరైన సమయంలో తనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తన మార్కెట్ పెరగడానికి బాబీ కారణమయ్యాడని భావించి చిరంజీవి ఈ బహుమతిని బాబీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య ఇప్పటికే పలు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాగా మరికొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. చిరంజీవి నుంచి గిఫ్ట్ అందడంతో బాబీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో చిరంజీవి బాబీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడంలో ముందువరసలో ఉంటారు. చిరంజీవికి బాబీ వీరాభిమాని కాగా మెగా అభిమానులకు నచ్చేలా బాబీ సినిమాలను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పవన్ కు హిట్టివ్వలేకపోయిన బాబీ చిరంజీవికి మాత్రం హిట్టిచ్చారు. దర్శకుడు బాబీ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.

త్వరలో బాబీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయని సమాచారం అందుతోంది. బాబీతో పని చేయాలని స్టార్ హీరోలు సైతం భావిస్తున్నారని తెలుస్తోంది. బాబీ కొత్త కథలను ఎంచుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాబీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus