వినాయ‌క్‌కు డెడ్‌లైన్ ఇచ్చిన మెగాబాస్‌..?

టాలీవుడ్‌లో కుర్ర హీరోల కంటే వేగంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో ఆచార్య సినిమాలో షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న చిరంజీవి, ఆ త‌ర్వాత వేదాళం, లూసీఫ‌ర్ రీమేక్స్‌లో న‌టించినున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌ర్ ఫేమ్ డైరెక్ట‌ర్ బాబీతో కూడా మ‌రో సినిమా చేయ‌నున్నార‌నే టాక్.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వేదాళం మూవీని, మెహ‌ర్ ర‌మేష్, లూసిఫ‌ర్ సినిమాని వివి వినాయ‌క్ డైరెక్ట్ చేయ‌నున్నార‌నే స‌మ‌చారం. ఆచార్య త‌ర్వాత వెంట‌నే వేదాళం సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఆ త‌ర్వాత లూసిఫ‌ర్ విష‌యంలోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు టాక్. మొద‌ట లూసిఫ‌ర్ కోసం యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ సెలక్ట్ అయినా స్క్రిప్ట్ విష‌యంలో మెప్పించ‌లేక‌పోవ‌డంతో అత‌ని ప్లేస్‌లో మెగా ఆస్థాన ద‌ర్శ‌కుడు వినాయ‌క్ వ‌చ్చి చేరాడు.

అయితే వినాయ‌క్ కూడా స్కిప్ట్ విష‌యంలో చిరంజీవి మెప్పించ‌లేక‌పోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. వ‌ర్జిన‌ల్ క‌థ‌లో ప‌లు మార్పులు చేసి తొలిభాగంలో మెగాస్టార్‌ను మెప్పించిన వినాయ‌క్, సెకండ్‌హాప్ విష‌యంలో మాత్రం అన్న‌య్య‌ను మెప్పించ‌లేక‌పోతున్నాడ‌ట‌. లూసిఫ‌ర్ సెకండ్‌హాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌తో పాటు ప‌లు కీల‌క స‌న్నివేశాలు ఒరిజిన‌ల్ మూవీకి ఆయువుప‌ట్టులా నిలిచాయి.

అయితే తెలుగులో మెగాస్టార్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు చేస్తున్న మార్పులు, బాస్‌ను సాటిస్‌ఫై చేయ‌డంలేద‌ట‌. దీంతో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ రీమేక్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా డీల్ చేసి ప‌వ‌న్‌కు సాలిడ్ హిట్ ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌నే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే చిరుకు అత్యంత ఆప్తుడు అయిన వినాయ‌క్‌ను అంత ఈజీగా త‌ప్పించే అవ‌కాశం లేద‌ని, ఆచార్య మూవీ షూట్ కంప్లీట్ అయ్యే లోపు త‌న‌కు న‌చ్చేలా స్క్రిప్ట్ రెడీ చేయాల‌ని వినాయ‌క్‌కు చిరు చెప్పాడ‌ని తెల‌స్తోంది. మ‌రి ఈసారి అయినా ఈ మాస్ డైరెక్ట‌ర్ మెగాస్టార్‌ను మెప్పిస్తాడా లేక లూసిఫ‌ర్ ప్రాజెక్ట్‌లో మ‌రో డైరెక్ట‌ర్ ఎంట‌ర్ అవుతాడా అనేది చూడాలి.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus