చిరు మరో రీమేక్ కి ఓకే చెప్పాడా..?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. అయితే ఆయన ఎన్నుకుంటున్న సినిమాలే అభిమానులకు కాస్త షాక్ ఇస్తున్నాయి. స్ట్రెయిట్ కథలను కాకుండా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు చిరు. ఇప్పటికే ‘కత్తి’ సినిమాను రీమేక్ చేసిన చిరు లాక్ డౌన్ లో వరుస పెట్టి రీమేక్ కథలను అనౌన్స్ చేస్తుండడం ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు.

ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ‘లూసిఫర్’ రీమేక్ కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండూ మాస్ సినిమాలే.. పైగా ఈ సినిమాలను డీల్ చేస్తోన్న దర్శకులపై కూడా ఆడియన్స్ లో నమ్మకం లేదు. ఈ రెండు సినిమాలు చాలవన్నట్లు మరో రీమేక్ పై చిరు దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో హిట్ అయిన ‘ఎన్నై అరిందాల్’ సినిమాను తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు.

ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో నటించడానికి చిరు అనుకుంటున్నారట. ఇప్పటికే తెలుగులో రిలీజై.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్న సినిమాను రీమేక్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus