వెంకీ – నితిన్‌ సినిమాకు చీఫ్‌ గెస్ట్‌గా చిరు.. విశేషమే కదా!

నితిన్‌ సినిమాకు మెగాస్టార్‌ చిరంజీవి క్లాప్‌ కొట్టారు. అవును, ఏముంది మైత్రీ మూవీ మేకర్స్‌ అంటే చిరంజీవికి అభిమానం, అలాగే నితిన్‌ పవన్‌ ఫ్యాన్‌ కదా అందుకే వచ్చి ఉంటారు అని అంటారా? అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఆ ఇద్దరికి, చిరంజీవి ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఇరువైపులా ఇబ్బంది పెట్టే అంశమే. కానీ అవన్నీ పట్టించుకోకుండా చిరంజీవిని ఈ ఈవెంట్‌కి పిలవడం, ఆయన రావడం జరిగిపోయాయి. ఏంటా పాయింట్‌, ఎందుకా విశేషం అనేది చూద్దాం.

చిరంజీవి – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో డీవీవీ దానయ్య ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా కథ మీద దర్శకుడు చాలా రోజులు కూర్చున్నారు కూడా. అయితే ఏమైందో ఏమో.. సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత సినిమా లేదు అని చెప్పకపోయినా.. నితిన్‌ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నారు వెంకీ కుడుముల. అలా చిరంజీవి సినిమా ఛాన్స్‌ను వెంకీ కుడుముల కోల్పోయారు. లేదంటే వెంకీ సినిమాను చిరంజీవి కోల్పోయారు అని చెప్పాలి. అలాంటి దర్శకుడు సినిమాకు చిరంజీవి చీఫ్‌ గెస్ట్‌గా రావడం విశేషమే కదా.

ఇక రెండో విషయం చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమాలో ఓ పాత్ర కోసం నితిన్‌ను అడిగారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ సినిమాలో కీర్తి సురేశ్‌ భర్త/ లవర్‌ పాత్ర ఒకటి ఉంటుంది. దాని కోసం నితిన్‌ను సంప్రదించారని, అయితే ఆయన ఎలాంటి స్పందనా ఇవ్వలేదు అని అన్నారు. మరి ఇప్పుడు నితిన్‌ కోసం చిరంజీవి రావడం విశేషమే కదా అంటున్నారు. మొదటి విషయంలో క్లారిటీ ఉన్నా, ఈ విషయంలో ఎక్కడా ఎలాంటి స్పష్టత లేదు.

వెంకీ కుడుమల, రష్మిక మందన, నితిన్ కలయికలో VNRTrio వర్కింగ్ టైటిల్‌తో ఉగాది రోజున సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌‌గా చిరంజీవి హాజరయ్యారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus