Chiranjeevi, Pooja Hegde: అబ్బో చిరులో ఈ రేంజ్ రొమాంటిక్ యాంగిల్ ఉందా.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..!

‘పూజ ఈజ్ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుంది అని ఎప్పుడూ నాతో చెబుతుంటుంది. ఈ మూవీలో రాంచరణ్‌ కు జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది’ అంటూ మొన్ననే ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి.. పూజా హెగ్డే పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరింత మైలేజ్ ఇచ్చారు చిరు.

Click Here To Watch NOW

తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం హీరోయిన్ పూజా హెగ్డేతో చిరు చేసిన ఫన్ మాములుగా లేదు. ఈ వేడుకకి పూజా హెగ్డే చాలా బాగా రెడీ అయ్యి వచ్చింది. బ్లాక్ సారీలో ఆమె ‘ఆచార్య’ మీడియా సమావేశానికి హాజరైంది. అక్కడికొచ్చిన జనాలను పూజ కళ్ళు తిప్పుకోకుండా చేసింది అనే చెప్పాలి. చిరు అయితే ఆమెను హగ్ చేసుకుంటున్నట్టు, రాంచరణ్ ను పక్కకు తోసేస్తున్నట్టు చేసి నవ్వులు పూయించారు.

ఈ మధ్యనే ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తాప్సికి పులిహోర కలిపిన చిరు ఈసారి పూజతో కలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై పూజ హెగ్డే స్పందిస్తూ.. ‘చిరు సర్ జోవియల్ నేచర్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. స్వీటెస్ట్ పర్సన్’ అంటూ కామెంట్ చేసింది. ఇంకొంతమంది అయితే ‘ఇదంతా కొరటాల వల్ల వచ్చింది.చిరుకి హీరోయిన్ ను లేకుండా చేశారు’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ లో బాలయ్య కూడా స్టేజి పై పూజ గ్లామర్ గురించి ఓ రేంజ్లో వచ్చేరాని హిందీలో మాట్లాడి నవ్వులు పూయించాడు. ఇప్పుడు చిరు ఇలా..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus