Chiranjeevi , Mehar Ramesh: మెగాస్టార్ మెహర్ కాంబినేషన్ లో మరో సినిమా.. ట్విస్ట్ ఏంటంటే?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన మెహర్ రమేష్ తెలుగులో తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. భారీ బడ్జెట్ తో మెహర్ రమేష్ సినిమాలను తెరకెక్కించగా ఎక్కువ సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగల్చడంతో పాటు మెగా ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చింది. అయితే చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో మరో సినిమా అంటూ ప్రచారం జరుగుతుండగా చిరంజీవి తన సినిమాకు పని చేసే ఛాన్స్ ఇవ్వడం లేదని తన కూతురు బ్యానర్ లో చిన్న సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

4 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి మెహర్ రమేష్ దగ్గర బంధువు అనే సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఈ వార్తల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మెహర్ రమేష్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఛాన్స్ రావడమే ఎంతో కష్టమనే సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ టేకింగ్ బాగానే ఉంటుందని కథ, కథనం విషయంలో పొరపాట్లు చేయడం వల్లే మెహర్ రమేష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెహర్ రమేష్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. భారీ సక్సెస్ దక్కే వరకు మెహర్ రమేష్ భారీ సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ కు వరుస ఫ్లాపుల వల్ల రెమ్యునరేషన్ తగ్గిందని తెలుస్తోంది. చిరంజీవి విషయానికి వస్తే మెగాస్టార్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus