Chiranjeevi: వెంకీ కుడుములతో చిరు సినిమా ఉంటుందా?

మెగాస్టార్ చిరంజీవి-వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన చాలా న్యూస్ లు బయటకొచ్చాయి. ఇదొక మల్టీస్టారర్ అని.. చిరుతో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తాడని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాపై కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ కాంబినేషన్ ఉండదని అంటున్నారు. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది.

Click Here To Watch NOW

ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ కి రాజమౌళి గెస్ట్ గా రావడంతో పాటు.. మెగాస్టార్ తో సినిమాలు చేస్తోన్న దర్శకులు, నిర్మాతలు అందరూ హాజరయ్యారు. కానీ వెంకీ కుడుముల మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన హాజరు కాకపోవడానికి ముందురోజు నుంచే ఈ గాసిప్ వినిపించడం మొదలైంది. చిరంజీవిని డైరెక్ట్ చేస్తోన్న దర్శకులందరూ ఈ ఈవెంట్ లో కనిపించారు. ఇలాంటి అవకాశాన్ని వెంకీ కుడుముల ఎందుకు మిస్ చేసుకుంటారు..?

మరీ ముఖ్యమైన పని ఉంటే తప్ప ఈవెంట్ కి రాకుండా ఉండరు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చేయబోయే నిర్మాత దానయ్య స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు.. తన స్పీచ్ లో చిరుతో సినిమా ఉంటుందని అనలేదు. దీంతో ఈ గాసిప్ మరింత వైరల్ అవుతోంది. కొద్దిరోజులు ఆగితే ఈ వార్తలపై క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతానికైతే ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వెంకీ కుడుముల గతంలో ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సినిమాలను నిర్మించారు.

మూడో సినిమాకి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందో లేదో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus